Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ ఎదుగుదలను మేమే పరిమితం చేసుకోలేం: ఎస్. జైశంకర్

S Jaishankar says we cannot limit Indias growth
Advertisement
  • భారత్‌ను మధ్యస్థ శక్తి అనే వర్ణనను తిరస్కరించిన విదేశాంగ మంత్రి జైశంకర్
  • మేము మధ్యస్థ శక్తి కాదు, మధ్యలో ఉన్న శక్తి అని వ్యాఖ్య
  • జనాభా, ఆర్థిక వ్యవస్థ పరంగా ఈ వర్ణన దేశాన్ని పరిమితం చేస్తుందని స్పష్టం
  • ప్రపంచం ప్రస్తుతం ఆర్థిక ఆంక్షల వంటి 'చోక్ పాయింట్స్'తో నిండి ఉందని విశ్లేషణ
  • భవిష్యత్తులో దేశాలు తమ బలాబలాలతోనే చర్చలకు వస్తాయన్న జైశంకర్
Advertisement
భారత్‌ను 'మధ్యస్థాయి శక్తి' అని పిలవడం సరికాదని, ఆ నిర్వచనంతో దేశాన్ని పరిమితం చేసినట్లు అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. తాము మధ్యస్థ శక్తి కాదని, 'మధ్యలో ఉన్న శక్తి' అని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ‘బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌’లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ను మధ్యస్థ శక్తిగా ఎందుకు అభివర్ణించకూడదు అని అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ, "ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా, సుమారు నాలుగు ట్రిలియన్ డాలర్ల జీడీపీతో, భవిష్యత్తులో అపారమైన అభివృద్ధి అవకాశాలు ఉన్న దేశానికి 'మధ్యస్థాయి శక్తి' అనే వర్ణన సౌకర్యంగా ఉండదు. ఆ నిర్వచనంతో మనల్ని మనమే పరిమితం చేసుకున్నట్టు అవుతుంది" అని వివరించారు. ఇతరులకు సాధికారత కల్పించే దేశాలనే మధ్యస్థ శక్తులుగా ప్రధాని మోదీ అభివర్ణించారని, కానీ భారత్ విషయంలో ఈ నిర్వచనం సరిపోదని ఆయన తెలిపారు.

ప్రస్తుత ప్రపంచం కేవలం మధ్యస్థాయి శక్తులతోనే కాకుండా ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చే సాధనాలతో నిండి ఉందని జైశంకర్ విశ్లేషించారు. "ఆర్థిక ఆంక్షలు, ఫైనాన్స్ వంటి అంశాలను కూడా ఇప్పుడు అస్త్రాలుగా వాడుకుంటున్నారు. ఇది ప్రపంచాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది" అని ఆయన అన్నారు.

భవిష్యత్తులో పోటీ స్వరూపం మారనుందని జైశంకర్ అభిప్రాయపడ్డారు. ప్రతి దేశం తమ బలాలు, వనరులతో చర్చలకు వస్తుందని, పరస్పర అవసరాల ఆధారంగా ఒప్పందాలు ఉంటాయని అన్నారు. "చర్చల్లో ఎవరు ఎక్కడ కూర్చుంటారు, ఎవరు గట్టిగా మాట్లాడతారు అనే విషయాలు మారుతాయి. ఈ మార్పుల గురించి నిరాశావాద దృక్పథం అవసరం లేదు" అని ఆయన భవిష్యత్ ప్రపంచ తీరును అంచనా వేశారు.
Advertisement
Advertisement
S Jaishankar
India GDP growth
Bloomberg New Economy Forum
India middle power status

More Telugu News